ధైర్యంగా గళమెత్తి పోరాటం చేయడమనేది తెలంగాణ ప్రజల్లోనే ఉంది: పవన్ కల్యాణ్

  • జనసేన తెలంగాణ విభాగం కమిటీలతో పవన్ భేటీ
  • కార్యవర్గానికి కర్తవ్యబోధ చేసిన జనసేనాని
  • సమస్యలపై పోరాటాలు చేద్దాం అంటూ పిలుపు
జనసేన తెలంగాణ విభాగం ఇటీవల యువజ, విద్యార్థి కమిటీలు నియమించింది. తాజాగా ఈ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, మన చుట్టూ ఉన్న ప్రజల కోసం బలంగా నిలబడి గొంతుక వినిపించాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ తరఫున అందరం క్రియాశీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో కావొచ్చు, కరీంనగర్ జిల్లాల్లోని ఓ గ్రామంలో కావొచ్చు, లేక పాలమూరు రైతులు, కూలీల ఇబ్బందులు కావొచ్చు... ఎక్కడ, ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా స్పందిద్దామని ఉద్బోధించారు. ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు కమిటీలతో సమావేశమై చర్చిద్దామని తెలిపారు. ధైర్యంగా గళమెత్తి పోరాటం చేయడమనేది తెలంగాణ ప్రజల్లోనే ఉందని అన్నారు. యువకులు, విద్యార్థులు రాజకీయ చైతన్యంతో ముందుకు వెళ్లి ప్రజలకు అండగా నిలవాలని అన్నారు.

Pawan Kalyan
Telangana Committees
Meeting
Janasena
Telangana

More Telugu News